పచ్చి అరటి పండుతో ఆరోగ్య ప్రయోజనాలు... ఏంటవి?

శుక్రవారం, 17 జూన్ 2022 (22:35 IST)
పచ్చి అరటిపండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బలాన్ని పెంచడానికి, కాల్షియం కోసం, ముఖ్యంగా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, అరటిపండుకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అయితే పచ్చి అరటిపండు ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. ఇందులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, జింక్ మొదలైనవి ఉంటాయి. ఈ కారణంగా ఇది శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

 
బరువు తగ్గడానికి పచ్చి అరటిపండు చాలా మంచి ఆహారం. ఇందులో పీచుపదార్థం ఉండటంతో త్వరగా ఆకలి అవదు. ఐతే శరీరంలో శక్తి ఉంటుంది. పచ్చి అరటి వృద్ధాప్యాన్ని నిరోధించే ఆహారం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఉంటాయి. ఇవి శరీరంలోని ముడతలను తగ్గిస్తాయి.

 
పచ్చి అరటిపండులో యాంటీ-డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే షుగర్ లెవెల్ బ్యాలెన్స్ చేస్తుంది. ఇందులో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది, దీని కారణంగా జీర్ణక్రియ సంబంధిత సమస్యలలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు