సన్నబడాలనుకుంటే బీరకాయే బెస్ట్

గురువారం, 28 మే 2020 (17:32 IST)
బీరకాయలో యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీబయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర మొత్తం శుధ్ది చేసే, యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ బయోటిక్ లక్షణాలు కలిగి, శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. అనారోగ్యంతో బాధపడుతున్నవారు బీరకాయను రోజు ఆహారంలో భాగం చేసుకుంటే త్వరగా కోలుకునేలా చేస్తుంది. 
 
అంతటి శక్తికలిగిన బీరకాయను జ్యూస్ రూపంలో తీసుకవడం వల్ల శరీరంలో జీవక్రియలు చురుకు పనిచేసేలా, త్వరగా తేరుకొనేందుకు సహాయపడుతుంది. ఏ ఇన్ఫెక్షన్ అయినా, ఏ వైరస్‌లు శరీరానికి సోకుండా సహాయపడుతుంది. ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు బీరకాయ రసం త్రాగితే రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.
 
బీరకాయలో విటమిన్ సితో పాటు ఐరన్, మెగ్నీషియం, థయామిన్ ఎక్కువగా వుంది. త్వరగా సన్నబడాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కాలేయ వ్యాధులను నివారిస్తుంది. ఉదర సంబంధ వ్యాధులకు కూడా బీరకాయ మంచి ఔషధం. బీ6 విటమిన్ వల్ల కంటి  సమస్యలు దూరమవుతుంది. శరీరాన్ని బీరకాయ కాంతివంతంగా చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు