వంటలో నువ్వుల నూనె.. మధుమేహం.. ఆస్తమాకు చెక్

గురువారం, 29 సెప్టెంబరు 2022 (22:49 IST)
Sesame oil
నువ్వుల నూనెను వంటల్లో ఉపయోగించడం ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నువ్వుల నూనెతో చేసే వంటకాలు సులభంగా జీర్ణం అవుతాయి. నువ్వుల నూనెతో చేసే ఆహారం తీసుకుంటే, పెద్దప్రేగు సజావుగా పనిచేస్తుంది. జీర్ణ సమస్యలు తలెత్తవు. 
 
నువ్వుల నూనెలోని మెగ్నీషియం.. ఇన్సులిన్ స్రావాన్ని నిరోధించి.. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. ఎముకలలో క్యాల్షియం స్థాయిని పెంచుతుంది. కాబట్టి ఎముకలు ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాలతో పాటు నువ్వుల నూనెను కూడా తీసుకోవాలి. అంతేగాకుండా నెయ్యి కూడా తీసుకుంటే మంచిది.
 
నువ్వుల నూనెలోని పోషకాలు వండిన ఆహారాన్ని తినేటప్పుడు శ్వాసకోశంలో వచ్చే నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా ఆస్తమా వ్యాధిగ్రస్తులు దీన్ని ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవడం మంచిది. 
 
రోజూ ఉదయాన్నే నిద్రలేచి 15 నుంచి 20 నిమిషాల పాటు నువ్వుల నూనెతో నోటిని పుక్కిలిస్తే దంత సమస్యలు దరిచేరవని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు