World Heart Day 2022 గుండె ఆరోగ్యంగా వుందా?

బుధవారం, 28 సెప్టెంబరు 2022 (17:39 IST)
సెప్టెంబరు 29 ప్రపంచ హృదయ దినోత్సవం. గుండె సమస్యలు దరిచేరకుండా వుండాలంటే సరైన జీవనశైలి అనుసరించాలి. క్రమంతప్పకుండా వ్యాయామంతో పాటు సరైన ఆహారం, వేళపాటు నిద్ర అవసరం. ఇవి పాటించకపోతే గుండెను ప్రమాదంలో పడవేసినట్లే.

 
ప్రతి ఏటా ప్రపంచంలో కోటీ 80 లక్షల మంది గుండె జబ్బులు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. సుదీర్ఘ పనిగంటలు చేస్తున్నందు వల్ల 7,45,000 మంది గుండె జబ్బుతో మరణిస్తున్నారు.

 
2000 నుంచి 2016 నాటికి ఇలా అత్యధిక పనిగంటలు చేసేవారు చనిపోతున్న సంఖ్య 29 శాతం పెరిగింది. అధిక రక్తపోటు లేదా ఎలివేటెడ్ బ్లడ్ ప్రెజర్ గుండె సమస్య, గుండె పోటును పెంచే ఒక తీవ్రమైన వైద్య పరిస్థితి. వాయు కాలుష్యం కారణంగా తలెత్తే గుండె సమస్యలతో ప్రపంచ మరణాల్లో 25 శాతం సంభవిస్తున్నాయి.

 
గుండె సంబంధిత సమస్యలు పురుషుల్లో కంటే మహిళల్లో అధికంగా కనబడుతున్నాయి. శారీరక శ్రమలేకపోవడం, పొగాకు, వాయు కాలుష్యం, మద్యపానం, అనారోగ్యకరమైన ఆహారం గుండె సమస్యలకు కారణం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు