అదే కనుక, బాదం పప్పును నానబెడితే వాటిపై పొట్టు ఊడిపోతుంది. ఒక గుప్పెడు బాదం పప్పును, అరకప్పు నీటిలో సుమారు ఎనిమిది గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత నీటిని తీసేసి, బాదంపప్పుపై పొట్టును తొలగించాలి.
వీటిని రోజూ పరగడుపున లేదంటే.. అల్పాహారానికి అరగంట ముందు తీసుకోవడం ద్వారా క్యాన్సర్ ముప్పును తొలగించుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుకోవచ్చు. అధిక బరువుకు చెక్ పెట్టవచ్చు. నానబెట్టిన బాదంలో ఉండే ఫోలిక్ యాసిడ్ పుట్టుకతో వచ్చిన లోపాలను దూరం చేస్తుంది. ముఖ్యంగా గర్భిణీ మహిళలకు బాదం పప్పులు ఎంతో మేలు చేస్తాయి.