నిల్చుంటేనే ఒత్తిడి తగ్గిపోతుందట.. ఎలా?

గురువారం, 15 సెప్టెంబరు 2016 (12:44 IST)
నిల్చుంటేనే ఒత్తిడి తగ్గిపోతుందట.. ఏంటీ ఆశ్చర్యం కలుగుతుందా.. అవును నిజమే... మనం నిల్చునే తీరూ, కూర్చునే విధానం.. ఒక్కమాటలో మన రోజువారి భంగిమలకీ మానసిక చిత్తవృత్తులకీ మధ్య చాలా దగ్గర సంబంధం ఉందని నిపుణులు అంటున్నారు. ఎప్పుడూ వంగిపోయినట్టు, ఏదో భయంతో కుంచించుకుపోయినట్టు, చేతులు ముడుచుకుని ఉంటే శరీరంలో కార్టిసాల్‌ హార్మోను పెరగుతుందట. నిజానికి మనలో ఒత్తిడికి ఇదే కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
అలాకాకుండా నిటారుగా భుజాలు విరిచి.. చేతులు రెండూ నడుంపై ఉంచి నిల్చోవడం, వెన్నెముక భాగం పూర్తిగా కుర్చీకి ఆనేలా ప్రశాంతంగా కూర్చోవడం, కాస్త ముందుకు వంగి బల్లపై చేతులు ఉంచి సూటిగా చూస్తున్నట్టు నిల్చోవడం వంటివన్నీ టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ని పెంచుతాయట. ఒత్తిడిని తగ్గించి ధైర్యాన్ని పెంచే హార్మోన్‌ ఇవేనట. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో రోజూ ఆఫీసులో సమయం దొరికినప్పుడల్లా ఇలా నిల్చోవడం, కూర్చోవడం సాధన చేస్తే మంచి ఫలితం కలుగుతుందని నిపుణులు సలహాలిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి