* బయట కొనే పదార్థాలపై చక్కెర శాతం ఎంత ఉందనేదీ తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అన్నిట్లో చక్కెర అని రాయకపోవచ్చు. బదులుగా ఫ్రక్టోస్, గ్లూకోజ్, మాల్టోస్ లాంటి పేర్లు ఉంటాయి. ఓఎస్ఈ అక్షరాలతో ముగుస్తుంటే అవి చక్కెరకు ప్రత్యామ్నాయం అనుకోవాలే తప్ప పోషకాలుగా భావించకూడదు.
* ఏదయినా పదార్థంలో నాలుగు చెంచాల చక్కెర వేసుకోవాలంటే సగం వేయండి. దానివల్ల రుచిలో పెద్దగా మార్పుండదు. మామిడి, అరటి, అనాస వంటి పండ్ల రసాల్లో అసలు వేసుకోకపోయినా ఫరవాలేదు.
* మిఠాయిలూ, ఇతర తీపి పదార్థాలకు ప్రత్యామ్నాయాలు వెతకండి. బిస్కెట్లూ, చాక్లెట్ల కన్నా బాదం, ఆయా కాలాల్లో వచ్చే పండ్లను ఎక్కువగా తినేలా చూసుకోండి. వాటి వల్ల పోషకాలు అందుతాయి. తీపి తినాలనే క్రేవింగ్స్‌నీ తగ్గిస్తాయవి. పైగా పండ్లు తినడం వల్ల శరీరానికి కావల్సిన పీచు సహజసిద్ధంగా అందుతుంది.
* పెరుగు, జావ లాంటి వాటిల్లో చక్కెర వేసుకునే బదులుగా కొద్దిగా దాల్చినచెక్క పొడిని చల్లుకోండి. ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు, తీపి తినాలనే కోరికనూ కొంతవరకు తగ్గిస్తుంది.