వేసవి కాలంలో పిల్లలకు పుచ్చకాయ, మామిడి, ఆపిల్ జ్యూస్‌లు ఇవ్వడం మంచిది. వీలైనంత వరకు ప్యాకేజ్డ్ డ్రింక్ పిల్లలకు అలవాటు చేయొద్దు. సహజ పదార్థాల నుంచి తీసిన పానీయాలను తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొందరు పిల్లలు బాదంపప్పు, జీడిపప్పు వంటి గింజల్ని తినడానికి ఇష్టపడరు. ఇలాంటి వారికి ఆల్మండ్ మిల్క్ బెస్ట్. ఇందులో ప్రొటీన్లు, న్యూట్రిన్లు అధికమని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.
కడుపులో ఎసిడిటీ తగ్గడంతో పాటు జీర్ణప్రక్రియ సుఖవంతంగా సాగుతుంది. అప్పుడప్పుడు లస్సీ కూడా తాగొచ్చు. ఇందులో పోషకవిలువలు ఎక్కువ. ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్లెయిన్ ఫిల్టర్ వాటర్ తాగే విధంగా పిల్లలకు అలవాటు చేయాలి. నీటిలో ఎటువంటి క్యాలరీలు, ఎటువంటి హానికారక రసాయనాలు ఉండవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.