పీతల్లో మన శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు వుంటాయి. పీత ఆహారంలో చేర్చడానికి ఉత్తమమైన మత్స్య రకాల్లో ఒకటి, ఎందుకంటే ఇది శరీరాన్ని బలంగానూ, ఆరోగ్యంగా ఉంచడానికి దోహదం చేస్తుంది.
అధిక ప్రోటీన్స్ కావాలంటే పీతలు తినాల్సిందే
కండరాలు, ఎముకలు, జుట్టు, చర్మం, రక్తం పట్టాలంటే శరీరానికి ప్రోటీన్ అవసరం. ఆహారంలో అధిక ప్రోటీన్ చేర్చుకోవడం వల్ల అనవసరమైన స్నాక్స్ జోలికి వెళ్లకుండా చేస్తుంది. అలాగే హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడే
శరీరంలో ట్రైగ్లిజరైడ్‌ల సంఖ్యను నియంత్రించకపోతే, అవి స్ట్రోక్, గుండెపోటు లేదా గుండె జబ్బుల అవకాశాలను పెంచుతాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు ప్రకారం ప్రతి ఒక్కరూ ఒమేగా-3 కలిగి ఉన్న చేపలను కనీసం వారానికి రెండుసార్లు తినాలని చెపుతోంది.
విటమిన్ బి2 నీటిలో కరిగేది కాబట్టి, దాని పూర్తి ప్రయోజనాలను పొందడానికి మన ఆహారం ద్వారా దీనిని తీసుకోవాలి. విటమిన్ బి2 ప్రోటీన్, కొవ్వులు, కార్బోహైడ్రేట్లను విచ్ఛిన్నం చేయడం ద్వారా పోషకాలను శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ విటమిన్ బి 2 తీసుకుంటే మంచిది. ఎందుకంటే మన శరీరం దానిని తక్కువ మొత్తంలో మాత్రమే నిల్వ చేయగలదు. కనుక పీతలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.