డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువగా అమెరికా, ఆస్ట్రేలియాలో పండిస్తారు. ప్రస్తుతం ఈ పండు మన దేశంలో కూడా పెరుగుతోంది. ఇది చూడటానికి పింక్ కలర్, డ్రాగన్ ఆకారంలో ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల కలిగే మరికొన్ని ప్రయోజనాలను తెలుసుకుందాం.
డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. ఎసిడిటీ, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారు ఈ పండుతో త్వరగా ఉపశమనం పొందుతారు. ఇంకా, డ్రాగన్ ఫ్రూట్ వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ దంతాలు, చిగుళ్ల సమస్యలను నివారిస్తుంది.