నేల ఉసిరి, చిన్న ఉసిరి. ఈ రెండింటికీ తేడా వుంది. నేల ఉసిరి కాయలు పచ్చళ్లను పట్టుకుంటూ వుండటం మనకు తెలిసిందే. ఐతే చిన్న ఉసిరి ఎక్కువగా శీతాకాలం చివర్లో వస్తుంటాయి. ఇవి తింటుంటే భలే పుల్లగా వుంటాయి. వీటి ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చిన్న ఉసిరి పండ్లను రక్త శుద్దీకరణ, ఆకలి ఉద్దీపనగా ఉపయోగిస్తారు. బ్రోంకటైస్, పిత్తాశయం, యూరినరీ సమస్యలు, డయేరియా, పైల్స్ వంటి రుగ్మతల నివారణకు మేలు చేస్తుంది.
వీటీని మన దేశంతో పాటు ఇతర ఆసియా దేశాలలో వంట, మూలికా ఔషధాలలో ఉపయోగిస్తారు.
వీటి నుంచి తయారైన మందులు యాంటీ ఏజింగ్, క్యాన్సర్ నివారణ, గుండెల్లో మంట తగ్గించడం తదితరాలకు వాడుతారు. ఈ పండ్లు విటమిన్ సితో నిండి ఉంటాయి, రోగనిరోధక ఆరోగ్యాన్ని ఆప్టిమైజ్ చేయడంలో సహాయపడతాయి.