కాలేయం అనేది మన శరీరంలో ముఖ్య అవయవం. అనేక కారణాల వల్ల కాలేయ సమస్యలు చుట్టు ముడతాయి. కొన్ని సార్లు ప్రమాదకర సమస్యలు కూడా వస్తాయి. వీటన్నింటిని ట్రీట్‌మెంట్‌తో సరిచేసుకోవచ్చు. కొన్ని ఆహార పదార్థాలను తినడం వల్ల లివర్ ఆరోగ్యం బాగుంటుంది. అవేంటో తెలుసుకోండి..
కాలేయాన్ని కాపాడుకోండి.
మన శరీరంలో అతి పెద్ద అవయవం కాలేయం. దీన్ని ఆరోగ్యంగా చూసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని అలవాట్ల కారణంగా త్వరగా కాలేయం దెబ్బతింటుంది. అలా కాకుండా లివర్ హెల్దీగా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
1."కాఫీ''..
ఓ స్ట్రాంగ్ కాఫీ తాగితే చాలు ఎంతో రిలాక్స్ అవుతాం. కొన్ని రోజులుగా కాఫీపై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు కాఫీని తాగడం వల్ల లివర్ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని తేల్చారు. కాఫీలోని ప్రత్యేక గుణాలు లివర్ క్యాన్సర్ రాకుండా చూస్తాయని తేలింది. కాబట్టి కాఫీని రెగ్యులర్‌గా తాగడం అలవాటు చేసుకోండి.
2."టీ"..
టీలోనూ ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి. ఈ టీని తాగడం కాస్తా ఒత్తిడిగా ఫీల్ అయినప్పుడు రిలాక్స్ అవుతామని తెలుసు. కానీ, కాలేయాన్ని కాపాడడంలో టీ కూడా కీ రోల్ పోషిస్తుందని చెబుతున్నారు నిపుణులు.
3."ద్రాక్ష"..
ద్రాక్షలోనూ ఎన్నో అద్భుత గుణాలు ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ లివర్‌ని రక్షిస్తాయి. కాబట్టి వీటిని కూడా మీ డైట్‌లో చేర్చుకోండి.
4."బెర్రీస్"..
బ్లూ బెర్రీస్, క్రాన్ బెర్రీస్‌లోనూ ఆంథోసియానిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయ ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి.
5.'వెల్లుల్లి"..
వెల్లుల్లిలో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. దీనిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలోని ట్యాక్సిన్స్ అన్నీ తొలగిపోతాయి. ఘాటైన వెల్లుల్లిలో కొలెస్టిరాల్‌ని తగ్గిస్తుంది. దీనిని తినడం వల్ల క్యాన్సర్ నిరోధిస్తుంది. దీనిని తినడం వల్ల కాలేయం ఆరోగ్యం బాగుంటుంది. కొలెస్టరాల్ ను తగ్గిస్తుంది , కాలేయ ఆరోగ్యానికి, కీళ్ళనొప్పులు తగ్గడానికి పనికివస్తుంది.
6."బీట్ రూట్"..
బీట్ రూట్, క్యారెట్, బంగాళా దుంపల్లో కాలేయ కణాల పునరుత్పత్తికి ఉపయోగపడపడే ఎన్నో గొప్ప గుణాలు ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ప్రతీరోజూ వీటిని మీ డైట్‌లో చేర్చుకుంటే కాలేయ పనితీరు మెరుగవుతుంది.
7."ఆపిల్స్"..
ఫైబర్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండి, సోడియం, పొటాషియం తక్కువగా ఉండే ఆపిల్స్ కూడా కాలేయాన్ని కాపాడతాయి. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. యాపిల్ తొక్క, లోపలి గుజ్జులోనూ పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది గ్యులాక్టురోనిక్ యాసిడ్ తయారీకి దోహదపడుతుంది. యాపిల్‌లో ఉండే మ్యాలిక్ యాసిడ్ అనేది పేగులు, కాలేయం, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. కాబట్టి వీటిని రెగ్యులర్‌గా తినొచ్చు.
8."గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్"..
శరీరానికి కావాల్సిన ఎన్నో ఖనిజ లవణాలు, విటమిన్లు, ప్రోటీన్లు ఈ ఆకుకూరల్లో ఉంటాయి. వీటిలో కొవ్వు శాతం కూడా తక్కువగా ఉంటుంది. ప్రతీరోజూ వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలు బయటికి వెళ్లిపోతాయి.
9."క్యాబేజీ"..
క్యాబేజీ కూడా కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మీ కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులోని ప్రత్యేక గుణాలు మీ లివర్‌ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి వీటిని కూడా మీ డైట్‌లో భాగం చేసుకోవడం మరిచిపోవద్దు.
10.నట్స్"..
గుడ్ ఫ్యాట్స్, ఎన్నో పోషకాలు ఉండే నట్స్ కూడా లివర్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ అన్నీ కూడా లివర్‌ని కాపాడతాయి. కాబట్టి రెగ్యులర్‌గా వీటిని మీరూ తీసుకోవచ్చు.
11.'చేపలు"..
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చేపలు కూడా లివర్‌ని కాపాడతాయి. వీటిని తినడం వల్ల గుండెకి మేలు జరుగుతుందని చెబుతున్నారు.
12."ఆలివ్ ఆయిల్"..
ఎన్నో ఆరోగ్య గుణాలు ఆలివ్ ఆయిల్‌లో దాగి ఉంటాయి. దీనిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ ఆయిల్ కూడా లివర్ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుందని తేలింది.