ఆడతల్లి ప్రసవానికి ఇంత భారమా? రోడ్డు పైనే ప్రసవాలా? ఇదేనా బంగారు తెలంగాణ?

బుధవారం, 31 మార్చి 2021 (23:42 IST)
తెలంగాణ రాష్ట్రంలో ప్రసవాలు రోడ్డుపైనే జరగడం దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన అన్నారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చేరువలో గల జవహార్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు రోడ్డుపై ఓ మహిళా ప్రసవం కావడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతుందన్నారు.
 
బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మాయ మాటలతో ప్రజలను మభ్య పెడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది బలిదానాలు చేసుకుంటే ఆ తల్లుల గర్భ శోకంతో తెలంగాణ ప్రభుత్వం ఆడుకుంటుందన్నారు. వైద్యం కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్న దానికి తాజా ఉదాహరణ జవహర్ నగర్ సంఘటనే నిదర్శనం అన్నారు.
 
నిలోఫర్, గాంధీ, జజ్జి ఖాన, సుల్తాన్ బజార్ హాస్పిటల్, ఉస్మానియా ఆసుపత్రులో అరకొర వసతులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రసవాల విషయంలో వెంటనే చర్యలు తీసుకొని జవహర్ నగర్‌లో పండంటి బిడ్డను పోగొట్టుకున్న బాధితురాలికి 50 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించి, నిర్లక్ష్యంగా వ్యవహరిరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి సూర్యదేవర లత పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు