హిందువులు పవిత్రంగా భావించే తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే దీనికి ఆయుర్వేదంలో చాలా ప్రాశస్త్యం ఉంది. తులసి ఆకులను చాలా మంది తరచుగా తింటుంటారు. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల సబ్బుల్లో, షాంపూల్లో విరివిగా ఉపయోగిస్తారు. తులసి ఆకులను ఆరబెట్టి పొడి చేసి తేనె లేదా పెరుగులో కలుపుకుని తింటే అనేక రోగాల నుండి ఉపశమనం పొందవచ్చు.
తులసి రసాన్ని అల్పాహారం తినడానికి అరగంట ముందు సేవిస్తే జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. రోజుకు మూడు సార్లు కూడా త్రాగవచ్చు. మలేరియా సోకినప్పుడు కొన్ని తులసి ఆకులను మిరియాల పొడితో కలిపి తింటే ఉపశమనం కలుగుతుంది. తులసి ఆకుల రసాన్ని, అల్లం రసాన్ని సమపాళ్లలో కలిపి కొంత మోతాదులో తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. పిల్లలకు వాంతులు అవుతున్నప్పుడు తులసి విత్తనాలను కొద్దిగా పెరుగు లేదా తేనెతో కలిపి చప్పరించమంటే తగ్గుముఖం పడుతాయి.
గ్యాస్ట్రిక్ సమస్యల నుండి బయట పడాలంటే నల్ల తులసి రసాన్ని మిరియాల పోడిలో కలిపి ఆ మిశ్రమాన్ని నూనె లేదా నెయ్యితో కలిపి సేవించండి. తులిసి ఆకులను నీళ్లలో మరిగించి తాగితే చెవి నొప్పికి బాగా పనిచేస్తుంది. కొన్ని లవంగ మొగ్గలు, కొన్ని బాదం పప్పులు కలిపి తింటే జీర్ణ వ్యవస్థకు మంచి చేస్తుంది.
నల్ల తులిసి రసాన్ని తేనెను కలిపి కళ్లకు రాసుకుంటే అలసట తగ్గడమే కాకుండా కంటి చూపు బాగుంటుంది. కడుపులోని నులిపురుగులు పొవాలంటే కొద్దిగా తులసి రసాన్ని, తగినంత నల్ల ఉప్పుతో కలిపి తీసుకోండి. నల్ల తులిసి ఆకుల రసాన్ని తాగే వాళ్లు ఆస్తమా నుండి కూడా బయటపడవచ్చు.