అలాంటప్పుడు మామూలు బియ్యంలో గుప్పెడు కొర్రలను వేసి అన్నం చేసుకుని తింటే మంచి గుణం ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. కొర్రల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందట. దీంతో సులువుగా జీర్ణమైపోతుంది. కొర్రలు జీర్ణక్రియను సాఫీగా సాగేలా చేస్తాయి. కొర్రలలో ప్రొటీన్లు 11 శాతం ఉంటాయి. ముఖ్యంగా కొర్రలతో చేసిన ఆహారం తింటే క్రొవ్వు పెరిగే సమస్య అసలు ఉండదంటున్నారు వైద్యులు. శరీరంలో జీర్ణక్రియలు సరిగ్గా నడిపించే శక్తి ఈ తృణధాన్యాలకు ఉంటుంది. అందుకే కొర్రలను ఖచ్చితంగా వాడండి అంటున్నారు వైద్య నిపుణులు.