బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇది శరీరంలో విపరీతంగా పెరిగినప్పుడు గుండెపోటు, టైప్ 2 డయాబెటిస్ ఇంకా ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. చివరికి వ్యక్తి మరణానికి దారి తీస్తుంది. కనుక ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను అదుపు చేసేందుకు పలు చర్యలు చేపట్టాలి. అవేంటో తెలుసుకుందాము.
మోనోశాచురేటెడ్ కొవ్వు, ఫైబర్ కలిగిన అవొకాడో తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు వ్యాయామం చేయాలి, ఇలా చేస్తే శరీరంలో చెడు కొవ్వు తగ్గుతుంది.
అవిసె గింజలు తింటే అవి చెడు కొలెస్ట్రాల్ పైన ప్రభావం చూపి ఆ సమస్యను నిర్మూలిస్తాయి.
ఉసిరి పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తాగుతుంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.