ఇది శరీర వేడిమిని తగ్గిస్తుంది. మజ్జిగలో అల్లం, మిరియాల పొడి, జీలకర్ర చేర్చి తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మజ్జిగ ఎముకలకు బలాన్నిస్తుంది. పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది.
మహిళలకు నెలసరి కాలంలో ఏర్పడే సమస్యలను దూరం చేస్తుంది. ఇందులోని ధాతువులు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మజ్జిగలో విటమిన్ సి, బి వుండటం చేత జుట్టు రాలడం తగ్గుతుంది. ప్రోబయోటిక్ లాక్టిక్ ఆమ్లం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.