వక్కపొడి వేసుకుంటే ఏమవుతుంది?

శనివారం, 12 డిశెంబరు 2020 (22:09 IST)
వక్కపొడి అతిగా వాడితే సమస్యలు వస్తాయి. మోతాదు మించని వక్కపొడి సేవనంతో ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. అందరూ భయపడినట్లు వక్కలు ఆరోగ్యానికి హానికరం కాదు వీటిలో సుగుణాలూ ఉన్నాయి. పొట్టలో చేరిన లద్దెపురుగులు, నులిపురుగులు ఈ వక్కపొడితో నశిస్తాయి.
 
అలాగే నోటి దుర్వాసను వక్కపొడి నమలడం ద్వారా తరిమికొట్టవచ్చు. వక్కలో వుండే ఎరికోలిన్‌ అనే పదార్ధము మెదడుపై ప్రభావితం చూపించి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. గుండె జబ్బులతో బాధపడేవారికి దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కొంతవరకు మేలు చేస్తాయి. స్కిజోఫ్రినియా అనే మానసిక వ్యాధి నుంచి విముక్తి పొందడానికి వక్కలు పనిచేస్తాయని కొన్ని పరిశోధనల ద్వారా తేలింది.
 
వక్కలు నమలడం వలన మెదడు మొద్దుబారుతుందని కొందరి నమ్మకం. ఐతే రోజంతా తింటే మటుకు అలాంటి ప్రభావం వుండవచ్చు. వక్కపొడి తినడం వల్ల దంతాలు నల్లబడతాయనే అపోహ కూడా వుంది కానీ ఇది నిజం కాదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు