జ్యూస్ డైట్ ఎవరు తీసుకోవాలి?
బరువు తగ్గడానికి, పెద్దపేగు పనితీరు బాగుండడానికి, ప్రొబయాటిక్ థెరపీ కోసం 20-40 ఏళ్ల మధ్యనున్న వారికి ఈ జ్యూస్ డైట్‌ని తీసుకోమంటుంటారు. కేన్సర్లతో బాధపడేవారికి చికిత్సలో భాగంగా జ్యూస్ డైట్‌ను సూచిస్తుంటారు. పెద్దవాళ్లకు కూడా జ్యూస్ డైట్ మంచిది. వారిలో ఆకలిని ఇది పెంచుతుంది. ప్రత్యేకంగా వైద్యులు సూచించే జ్యూసుల్లో ఫైటోన్యూట్రియంట్లు ఎక్కువగా ఉంటాయి. డయాబెటిక్స్ పేషెంట్లు, కిడ్నీ, కాలేయం జబ్బులతో బాధపడేవాళ్లు డాక్టర్ల సలహా మేరకు ఈ డైట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.