అడాప్టివ్ రేడియోథెరపీతో 88 ఏళ్ల వ్యక్తిని రక్షించిన అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్, హైదరాబాద్

శుక్రవారం, 27 అక్టోబరు 2023 (17:08 IST)
హైదరాబాద్‌లోని సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్, హైరిస్క్ ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 88 ఏళ్ల పురుషుడికి అధునాతన ఎక్స్‌టర్నల్ రేడియోథెరపీని విజయవంతంగా అందించి కాపాడింది. హైపోఫ్రాక్షనేటెడ్ అడాప్టివ్ రేడియోథెరపీగా సంబోధించే రేడియోథెరపీ టెక్నిక్ యొక్క ఈ అత్యంత అధునాతన రూపాన్ని రేడియేషన్ ఆంకాలజిస్ట్ మరియు బ్రాచిథెరపీ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ హర్జోత్ కౌర్ బజ్వా నాయకత్వంలోని బృందం విజయవంతంగా నిర్వహించింది. ఫాలో అప్‌లో రోగి క్యాన్సర్‌ని జయించాడని ప్రకటించడం జరిగింది. అతను తన జీవన  నాణ్యతను కాపాడుకుంటూ అద్భుతమైన ఆరోగ్యంతో ఉన్నాడు.
 
శ్రీ బత్రా (పేరు మార్చబడింది) గత 3 నెలలుగా పలుమార్లు మూత్రవిసర్జన చేయాల్సి రావటం, మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బంది వంటి సమస్యలతో వచ్చారు. ఆయనను పరీక్షించిన తర్వాత, రోగికి హై-రిస్క్ ప్రోస్టేట్ క్యాన్సర్ (అడ్వాన్స్డ్ స్టేజ్) ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రోస్టేట్ గ్రంధిలోని కణాలు నియంత్రణ లేకుండా పెరగడం ప్రారంభించినప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రారంభమవుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్‌తో సంబంధం ఉన్న లక్షణాలలో దిగువ మూత్ర మార్గ లక్షణాలు (LUTS), మూత్రంలో రక్తం, అంగస్తంభన లేకపోవటం లేదా మూత్రం నిలుపుదల చేయలేక పోవటం వంటివి ఉంటాయి. రోగ నిర్ధారణ, చికిత్స ఎంపికలు క్యాన్సర్ దశపై ఆధారపడి ఉంటాయి. (PSA స్థాయి, గ్లీసన్ స్కోర్, గ్రేడ్ గ్రూప్, క్యాన్సర్ వల్ల ప్రోస్టేట్ ఎంతవరకు ప్రభావితమవుతుంది మరియు క్యాన్సర్ శరీరంలోని ఇతర ప్రదేశాలకు వ్యాపించిందా వంటివి) 
 
"ప్రోస్టేట్ క్యాన్సర్‌లో అధునాతన రేడియోథెరపీని అందించడం చాలా కష్టమైనది, ఎందుకంటే చికిత్స సమయంలో, చికిత్స జరుగుతున్నప్పుడు ప్రోస్టేట్ గ్రంధి కదులుతుంది. అలాగే, మూత్రాశయం, పెద్ద ప్రేగు మరియు పురీషనాళం వంటి చుట్టుపక్కల ఉన్న సాధారణ అవయవాలు కూడా కదులుతూ ఉంటాయి. ప్రతిరోజూ వివిధ స్థాయిలలో అవి నిండుతూ ఉంటాయి. ఇది సాధారణ అవయవాలకు అసలు చికిత్స మోతాదు అందించటంపై గణనీయంగా  ప్రభావం చూపుతుంది, అలాగే దుష్ప్రభావాలను పెంచుతుంది. కొన్నిసార్లు, పురీషనాళం నిండటం వలన చికిత్సా క్షేత్రం నుండి కణితి స్థానభ్రంశం చెందవచ్చు దీనివల్ల చికిత్స లక్ష్యం నెరవేరక ఫలితాలు ప్రతికూలంగా వుండవచ్చు" అని డాక్టర్ హర్జోత్ కౌర్ బజ్వా చెప్పారు.
 
ఆమె మరింతగా వివరిస్తూ "మేము తక్కువ సమయంలో చాలా ఎక్కువ మోతాదులో రేడియేషన్‌ను పంపిణీ చేస్తున్నాము కాబట్టి, ప్రతి చికిత్సకు ముందు మేము కణితిని ఖచ్చితంగా స్థానికీకరించాలి. ETHOS మెషీన్‌లో రోజువారీ ఇమేజింగ్‌ను ఉపయోగించడంతో, మేము స్పష్టంగా కణితి యొక్క స్థానం మరియు సాధారణ నిర్మాణాలు అంచనా వేయగలిగాము. శరీర నిర్మాణంలో మార్పుపై ఆధారపడి, ఈ యంత్రం రోజువారీ ఆన్‌లైన్ అనుకూల ప్రణాళికను నిర్వహిస్తుంది, దీని ఫలితంగా ఖచ్చితమైన రేడియేషన్ డెలివరీ జరుగుతుంది మరియు దుష్పరిణామాలను తగ్గిస్తుంది" అని అన్నారు 
 
AOI హైదరాబాద్ ప్రాంతీయ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్ పి మాట్లాడుతూ, “ఆంకాలజీ రంగంలో ఆవిష్కరణ  మరియు అత్యాధునిక సాంకేతికత అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)లో మా మిషన్‌లో ప్రధానమైనది మరియు  హై-రిస్క్ ప్రోస్టేట్ క్యాన్సర్‌తో పోరాడుతున్న 88 ఏళ్ల పురుషునికి విజయవంతమైన చికిత్సను అందించామని వెల్లడిస్తున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. ETHOS- AI ఆధారిత అడాప్టివ్ రేడియోథెరపీని అమలు చేయడంలో మా అంకితభావంతో కూడిన బృందం యొక్క అసాధారణమైన నైపుణ్యం రోగి సంరక్షణ పట్ల మా నిబద్ధతలో ఒక అద్భుతమైన ప్రమాణాన్ని సెట్ చేసింది. ETHOS, దాని రోజువారీ ఇమేజింగ్ మరియు అనుకూల ప్రణాళిక సామర్థ్యాలతో, మా విధానాన్ని విప్లవాత్మకంగా మార్చింది. ఫలితంగా మరింత లక్ష్యంగా మరియు ప్రభావవంతమైన రేడియేషన్ డెలివరీ మాత్రమే కాకుండా, దుష్ప్రభావాల తగ్గింపు కూడా సాధ్యమవుతుంది. చివరికి రోగి యొక్క జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఈ విజయం క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాటంలో మార్పు తీసుకురావడానికి మరియు మేము సేవ చేసే వారందరికీ ఆశ, వైద్యం మరియు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడానికి మా మిషన్‌ను బలపరుస్తుంది.
 
హైదరాబాద్‌లోని నల్లగండ్లలోని సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI) ఈ ప్రాంతంలో అనేక రకాల క్యాన్సర్ చికిత్స సేవలను అందిస్తోంది. 300 పడకల ఆసుపత్రిలో ఉన్న ఈ సమగ్ర క్యాన్సర్ సదుపాయం, అత్యున్నత ప్రమాణాలతో కూడిన క్లినికల్ ఎక్సలెన్స్, అత్యాధునిక సాంకేతికత, అంతర్జాతీయ నైపుణ్యంతో సమగ్ర క్యాన్సర్ సంరక్షణను అందించడానికి అంకితం చేయబడింది. ఇంటర్నేషనల్ ట్యూమర్ బోర్డ్ యొక్క ఎలైట్ గ్లోబల్ నెట్‌వర్క్‌లో గర్వించదగిన సభ్యుడిగా, హైదరాబాద్‌లోని AOI ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైద్య నిపుణులతో సన్నిహితంగా భాగస్వామ్యం చేసుకుంది. పీడియాట్రిక్ హేమాటో ఆంకాలజీ & BMT మరియు యూరో-ఆంకాలజీతో సహా అంకితమైన సేవల శ్రేణిలో ప్రత్యేకతను AOI హైదరాబాద్ కలిగి ఉంది. అదనంగా, AOI యొక్క సమగ్ర రోబోటిక్ ప్రోగ్రామ్ ఖచ్చితమైన శస్త్రచికిత్స జోక్యాల కోసం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తుంది. అధునాతన పెయిన్ మేనేజ్‌మెంట్ చికిత్స సమయంలో సరైన సౌలభ్యం మరియు ఉపశమనాన్ని నిర్ధారిస్తుంది, అయితే క్రిటికల్ కేర్ సేవలు క్లిష్టమైన కేసులకు రోజంతా పర్యవేక్షణ మరియు మద్దతును నిర్ధారిస్తాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు