సోషల్ మీడియాలో ఇపుడు ఓ వీడియో వైరెల్‌గా మారింది. అది హ్యాండ్ వాష్ డాన్స్ వీడియో. సాధారణంగా భోజనం చేసేందుకు ముందు చేతిని శుభ్రంగా కడుక్కోవడం మంచిది. అయితే, చాలా మందికి ఈ ఆలవాటు ఉండదు. దాని వల్ల చేతుల మీద ఉన్న దుమ్ము, ధూళితోనే ఆహారం తినేస్తారు. అయితే, పలువురు వైద్యులు కలిసి హ్యాండ్ వాష్‌పై అవగాహన కల్పించే నిమత్తం "హ్యాండ్ వాష్ డాన్స్" పేరుతో ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది ఇపుడు వైరల్‌గా మారింది. ఆ వివరాలను పరిశీలిస్తే...
ఇండోనేషియాకు చెందిన ఐదుగురు వైద్యులు నృత్యం చేస్తూ చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఒక్కొక్క వైద్యుడు చేతుల పరిశుభ్రత గురించి నృత్యం చేస్తూ వివిధ భంగిమల ద్వారా తెలియజేశారు. హ్యాండ్ వాషింగ్ డాన్స్ పేరుతో విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 20 లక్షల మందికి పైగా వీక్షించడం గమనార్హం. సో.. మీరూ ఓ లుక్కేయండి.