పురిటి నొప్పుల సమయంలో డ్యాన్స్...

సోమవారం, 22 జనవరి 2018 (11:53 IST)
సాధారణంగా మహిళలు గర్భధారణను నవమాసాలు మోయటం ఒక ఎత్తు అయితే.. పిల్లల్ని ప్రసవించడం మరో ఎత్తు. ప్రసవ సమయంలో మహిళల కష్టాలు వర్ణాతీతంగా ఉంటాయి. ఒక వైపు పురిటినొప్పులు భరిస్తూనే... మరో వైపు పండంటి బిడ్డకు జన్మనిస్తారు. ఆ సంతోషంలో ఆనందభాష్పాలు రాల్చుతారు.
 
అయితే, ప్రసవ సమయంలో పురిటినొప్పుల బాధ మరిచిపోవాలనే ఉద్దేశంతో బ్రెజిల్‌కు చెందిన డాక్టర్ ఫెర్నాండో ఆ సమయంలో వారితో కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. పురిటినొప్పుల సమయంలో డ్యాన్స్ చేయడంతో గర్భిణికి కాస్త ఉపశమనం కలుగుతుందని వైద్యుడి వాదనగా ఉంది. ప్రసవానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదనీ, సుఖ ప్రసవం జరుగుతుందని డాక్టర్ ఫెర్నాండో అంటున్నారు. 
 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు