ఆత్మహత్యలను ప్రేరేపిస్తున్న స్మార్ట్ ఫోన్లు..

సోమవారం, 4 డిశెంబరు 2017 (12:05 IST)
స్మార్ట్ ఫోన్ల వినియోగం ప్రస్తుతం ఓ వ్యసనంలా మారిపోయింది. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో ఎక్కువ మంది తమ దినచర్యను ఫోన్ పరిశీలించడంతోనే ప్రారంభించి.. నిద్రకు ఉపక్రమించేందుకు కూడా ఫోన్ పరిశీలించాకే నిద్రిస్తున్నారు. అలాంటి వారు మీరైతే జాగ్రత్త పడండి. స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికాలను వినియోగించడం ద్వారా మానసిన అలసట పెరగడంతో పాటు యువతలో ఆత్మహత్యను ప్రేరేపిస్తుందని ఫ్లోరిడా యూనివర్శిటీ పరిశోధకులు నిర్వహించిన పరిశోధనలో తేలింది. 
 
స్మార్ట్ ఫోన్స్, స్క్రీన్ కలిగిన పరికరాలను అధిక సమయం వినియోగిస్తే.. ఆత్మహత్యలను ప్రేరేపిస్తుందని.. మానసిక ఆందోళన, అలసట ఆవహిస్తుందని పరిశోధకులు అంటున్నారు. రోజుకు గంటకు నాలుగు లేదా ఐదు గంటల పాటు స్మార్ట్ ఫోన్లు వంటి పరికరాలను ఉపయోగించే వారిలో48 శాతం మంది ఆత్మహత్యకు సమమైన అలవాట్లకు బానిసలవుతున్నారని పరిశోధనలో వెల్లడైంది. 
 
స్మార్ట్ ఫోన్లను అధికంగా ఉపయోగించే వారిలో సంతోషం లేదని.. స్మార్ట్ ఫోన్లు కాకుండా వ్యాయామం, క్రీడలు, ఇతరులతో మాట్లాడటం వంటి చర్యల్లో పాల్గొనే వారికి మానసిక ప్రశాంతత ఏర్పడినట్లు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీరిలో ఒత్తిడి ఏమాత్రం కనిపించలేదని పరిశోధకులు చెప్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు