ఈ పరిస్థితుల్లో నత్తల విషయంలో చక్కెర్ వ్యాధికి చెక్ పెట్టొచ్చని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చెపుతున్నారు. సముద్రపు నత్త విడుదల చేసే విషంతో చిన్నచిన్న చేపలు క్షణంలో అచేతనమైపోతాయి. దీంతో వాటిని హాయిగా ఆరగించేస్తుంది! 'కోనస్ జియోగ్రాఫస్' అనే ఆ నత్త విషం మధుమేహ రోగులకు అతి శక్తిమంతమైన ఇన్సులిన్ ఔషధంగా కూడా పనిచేస్తుందని ఆస్ట్రేలియాలోని వాల్టర్ అండ్ ఎలీజా హాల్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా నిర్ధారించారు.