ఇంతకుముందు కంగువా సినిమాతో సూర్య వచ్చారు. కానీ ఆ సినిమా పెద్దగా ఫలితం ఇవ్వలేదు. కాగా, సూర్య సినిమాకు విజయ్ గెస్ట్ గా రావడంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు స్పందిస్తున్నారు. సూర్య వంటి స్టార్ కు విజయ్ ఏమిటి? ఇంకా ఎవరూ లేరా? అంటూ కామెంట్లు చేయడం విశేషంగా అనిపిస్తున్నాయి. ఇదిలా వుండగా, సూర్య మరో చిత్రం నిర్మాణంలో వుంది. సితార ఎంటర్ టైన్ మెంట్ పై రూపొందనున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ నాయికగా నటిస్తోంది.