అనంతరం రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ.. "ఇప్పుడే 'కలియుగమ్ 2064' ట్రైలర్ చూశాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆబ్సోల్యూట్లీ ఒక ఫ్యూచరిస్టిక్ ఎక్స్పీరియన్స్ కలిగింది. ఫోటోగ్రఫి, క్యారెక్టర్స్ డిజైన్. ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్.. ఇలా అన్నీ ఒక మోడరన్ కైండ్ ఆఫ్ బుక్ చదివిన ఫీలింగ్ ఇచ్చాయి. మే 9న థియేటర్లలో రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా చూడండి. ఈ సందర్భంగా చిత్ర బృందానికి నా బెస్ట్ విషెస్ చెబుతున్నాను" అంటూ తెలిపారు.
ఇక 'కలియుగమ్ 2064' ట్రైలర్ విషయానికి వస్తే భవిష్యత్తులో ముఖ్యంగా 2064 లో వచ్చే విపత్కర పరిస్థితుల్లో మనుషులు మనుగడ కోసం చేసే పోరాటాన్ని ప్రధానంగా చూపించారు. ఆహారం, నీరు, మానవత్వం అనేవి కరువైనప్పుడు విచక్షణ జ్ఞానం కోల్పోయి మనుషులు ఎలాంటి ఘోరాలకి పాల్పడ్డారు? అనే థీమ్ తో కలియుగంలోని పౌరాణిక ఇతివృత్తాలను గుర్తుచేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్ని ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్ళే విధంగా ఉన్నాయి.ముఖ్యంగా పి.సి.శ్రీరామ్ శిష్యుడు కె.రాంచరణ్ అందించిన సినిమాటోగ్రాఫి టాప్ నాచ్ లో ఉంది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.
నటీనటులు: శ్రద్ధా శ్రీనాధ్, కిషోర్, ఇనియన్ సుబ్రమణి, హ్యారీ తదితరులు
సాంకేతిక నిపుణులు: నిర్మాత :కె. యస్. రామకృష్ణ, రచన & దర్శకత్వం :ప్రమోద్ సుందర్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ :కె. రామ్ చరణ్, సంగీత దర్శకుడు :డాన్ విన్సెంట్, పీఆర్ఓ : ఫణి కుమార్