పురుషుల్లో ఆ సమస్యలకు యాలకులు దివ్యౌషధంగా పనిచేస్తాయట..!

సోమవారం, 29 ఏప్రియల్ 2019 (17:14 IST)
నేటి బిజీ లైఫ్‌లో చాలా మంది సెక్స్ సంబంధమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. సరైన అవగాహన లేకపోవడం మరియు ఏవేవో ఇతరత్ర కారణాల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో ముఖ్యంగా మగవారు శీఘ్రస్కలన సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు యాలకులు చక్కని పరిష్కారం అని నిపుణులు చెబుతున్నారు. 
 
చాలా సమస్యలకు పరిష్కారం మన వంటింట్లోనే దొరుకుతుంది. ఈ వంటింటి పదార్థాలను మన పూర్వీకులు చక్కగా వినియోగించుకున్నారు కాబట్టే వారికి అప్పట్లో అంతగా సమస్యలు ఉండేవి కావు. సెక్స్ విషయంలోనూ అంతే. మగవారు ఎదుర్కొనే శృంగార సమస్యల్లో శీఘ్రస్కలన సమస్య ప్రధానమైనది. ఈ సమస్యకి యాలకులతో చెక్ పెట్టవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. 
 
యాలకులలోని సినేయన్ పదార్థం కోరికలను పెంచి యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. దీంతో సెక్స్‌ని ఆస్వాదించవచ్చు అని పరిశోధనలలో తేలింది. కాబట్టి యాలకులను ఎక్కువగా ఆహారంలో భాగంగా చేసుకోవాలంటూ, అప్పుడు సమస్య పరిష్కారం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు