నాకు 32 ఏళ్లు... 18 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తేడా వస్తుందా?

సోమవారం, 11 మార్చి 2019 (19:16 IST)
ఉద్యోగంలో సెటిలయ్యేసరికి నాకు 32 ఏళ్లు వచ్చేశాయి. అంతకుముందే పెళ్లి చేసుకుంటానంటే మా పేరెంట్స్ ఉద్యోగం లేనిదే పెళ్లి చేయమని మొండికేశారు. ఇప్పుడు ఉద్యోగం వచ్చేసరికి 32 ఏళ్లు నిండాయి. ఎన్ని సంబంధాలు చూసినా మ్యాచ్ కుదర్లేదు.

ఇటీవలే నాలుగైదు సంబంధాలు చూశారు. వారిలో మా పేరెంట్స్‌కు ఓ అమ్మాయి బాగా నచ్చింది. నాక్కూడా నచ్చింది. ఐతే ఆమెకు 18 ఏళ్లే. ఆమెకి నాకు 14 ఏళ్ల గ్యాప్ ఉంది. పెళ్లయ్యాక ఆమె 30ల్లోకి వచ్చేసరికి నేను 40లు దాటిపోతాను. శృంగార సమస్య ఉత్పన్నమై ఏమయినా ఇబ్బంది వస్తుందేమోననే అనుమానం ఉంది... అలా అవుతుందా...?
 
శృంగార సామర్థ్యం వయసును బట్టి మారుతూ ఉంటుంది. స్త్రీ విషయానికి వస్తే కనీసం 20 ఏళ్లు దాటకుండా పెళ్లి చేస్తే ఆమె శారీరకంగా చాలా సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. చిన్న వయసులోనే తల్లి కావడం, ఆ వయసులో ఆమె ఆరోగ్యానికి హానికరం.

ఏదేమైనా ఐదారేళ్లు తేడాను మించి పెళ్లాడటం వల్ల కాస్త అభిప్రాయభేదాలు వచ్చే అవకాశాలు చాలాచోట్ల చూస్తున్నాం. అలా కాకుండా అంతకంటే తక్కువ వ్యత్యాసంతో పెళ్లాడితే ఇద్దరికీ అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత మీ ఇష్టం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు