శృంగారంలో ఆడవారు కోరుకునేదేమిటి? మగవారు చేస్తున్నదేమిటి?

మంగళవారం, 22 జనవరి 2019 (19:34 IST)
ఇటీవలి కాలంలో శృంగార సమస్యలకు మాత్రల ఆర్బాటం పెరిగిపోయింది. వాజీకరణాలు, సామర్ద్య సాధనాలంటూ మార్కెట్లో రకరకాల మాత్రల గురించి విస్తృత ప్రచారం జరుగుతుంది. ఒక రకంగా పురుషుల్లో అత్యధికంగా కనిపించే అంగస్తంభన సమస్యకు వయాగ్రా మొదలైనటువంటి మాత్రలు అందుబాటులోకి రావడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇటీవల చాలామంది ఈ మాత్రలనే ఆశ్రయిస్తున్నారని, ఈ పద్ధతి సరియైనది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాత్రలు వేసుకుంటే శృంగార జీవితం దానంతట అదే ఉరకలెత్తుతుందని  భావించకూడదంటున్నారు.
 
1. పురుషుల్లో అంగ స్తంభన సమస్యలు చాలా ఎక్కువ. నడి వయసు వచ్చేసరికి చాలామంది మానసికంగా మధనపడుతుంటారు. దీన్ని చక్కదిద్దడానికి ఇప్పుడు సమర్థమైన మందులు అందుబాటులో ఉన్నమాట వాస్తవం. కానీ... శృంగార జీవితంలో భాగస్వాములిద్దరికి తృప్తి దక్కాలంటే అంగ స్తంభనలు బాగుండటం, సంభోగం ఒక్కటే ముఖ్యం కాదని గ్రహించాలి.
 
2. ఇద్దరి మధ్య అన్యోన్యమైన అవగాహన, ప్రతి దశలోనూ దాంపత్య సుఖాలను కలిసి ఆస్వాదించే స్వభావాన్ని పెంచుకోవాలి. పటుత్వం కోసం మాత్రలను ఆశ్రయించడానికి ముందే వాటి గురించి భాగస్వామితో చర్చించాలి.
 
3. భార్యాభర్తలిద్దరూ శృంగారంలో ఇష్టాయిష్టాల గురించి అరమరికలు లేకుండా మాట్లాడుకోవడం అవసరం. ముఖ్యంగా ఆడవారు, ప్రేమగా మాట్లాడడం, సాన్నిహిత్యాన్ని వివిధ రూపాల్లో చూపించడం, సున్నిత స్పర్శల వంటి వాటిని ఎక్కువగా ఆస్వాదిస్తారు. అంతేగానీ... నేరుగా లైంగిక చర్యలకు ఉపక్రమించకూడదు.
 
4. మాత్రలు, మందులూ తీసుకున్నా కొన్నిసార్లు అంగస్తంభన సమస్యలు తలెత్తుతూనే ఉండవచ్చు. గాఢమైన వాంఛ, శారీరక ప్రేరణల వంటివి లేకపోతే మందులు తీసుకున్నా తృప్తి దక్కకపోవచ్చు. 
 
5. ఇటువంటి సందర్భాల్లో భాగస్వాములిద్దరూ ఒకరి నుంచి మరొకరు ఏం ఆశించొచ్చన్నది వాస్తవిక దృక్పధంతో అర్థం చేసుకోవాలి.
 
6. వయసును బట్టి శృంగార జీవితంలో వచ్చే మార్పులు ఎలా ఉంటాయన్న విషయాలపై అవగాహన పెంచుకోవాలి. సంభోగ సమయంలో సంతృప్తి దక్కనప్పుడు బాధలో కూరుకుపోవడం, కుంగిపోవడం కాకుండా ఆ ఇబ్బందికర సందర్భాన్ని నెగ్గుకొచ్చేందుకు సన్నద్ధం కావాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు