శృంగారం అనగానే కొంతమంది స్త్రీలు... ఛీ... అలాంటి మాటలు మాట్లాడవద్దని వారిస్తుంటారని భర్తలు ఆరోపిస్తుంటారు. అసలెందుకు వారలా ప్రవర్తిస్తుంటారు అని నిపుణులను అడిగితే... వారు ఇలా చెపుతున్నారు. చాలామంది అమ్మాయిలకు చిన్నప్పటి నుంచే శృంగారం అనే పదంపై వ్యతిరేక భావం కలిగి వుంటుంది. అందువల్ల స్త్రీ అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ.. శృంగారంపై చర్చ, ఆ పదం విన్నా ఏహ్యభావాన్ని చూపుతుంటారు.
మరికొందరు మహిళల్లో పూర్తి సంతృప్తిగా శృంగారంలో పాల్గొన్నప్పటికీ.. లోలోన భయం వుండటంతో ఆ సమయంలో వారి నుంచి స్రావాలు విడుదల కావు. దీంతో శృంగారంలో పాల్గొన్నామన్న ఆనందం వారిలో కనిపించదు. చిన్నప్పుడు లైంగిక వేధింపులకు గురికావడం, లైంగిక పరిజ్ఞానం లేకపోవడం తదితర కారణాలు ఇందుకు ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు.
వీటన్నింటి కంటే ముఖ్యంగా, అసౌకర్యంగా ఉండటం, చికాకుగా ఉండటం వల్ల కూడా శృంగార సమయంలో ఆసక్తి చూపించరు. ఇలాంటి సమస్యల నుంచి బయటపడేందుకు నిపుణులైన వైద్యులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తే ఫలితం ఉంటుందని చెపుతున్నారు.