నా భార్య వద్ద త్వరగా ఔటవుతున్నా... మిగిలినవారు కూాడా అంతేనా?

సోమవారం, 4 మార్చి 2019 (22:05 IST)
ఇటీవలే వివాహమైంది. నాకు కోర్కెలు ఎక్కువ. కొత్తగా వివాహం కావడంతో భార్యతో బాగా ఎంజాయ్ చేయాలని ఎంతో ఆశపడేవాడిని. అలా ఎన్నో ఆశలతో తొలి రోజున చేసిన ప్రయత్నం ఫెయిలైంది. శృంగారం చేయబోయే సమయానికి ఔటైపోయాను.

ఆ తర్వాత వేకువజామున మళ్లీ ప్రయత్నించాను. అపుడు కూడా ఇదే పరిస్థితి. అయితే, మరుసటి రోజు పాల్గొన్నప్పటికీ పూర్తి స్థాయిలో చేయలేకపోయా. దీంతో నా భార్య నీవు ఎందుకు త్వరగా ఔటై పోతున్నావంటూ ప్రశ్నించింది. ఏమని సమాధానం చెప్పాలో తెలియక మిన్నకుండి పోయాను. నాకే ఇలా జరుగుతుందా... మిగిలినవారికి కూడా ఇంతేనా? 
 
శృంగార సమయంలో సంతృప్తికరమైన రీతిలో స్తంభనలు కలుగటంలేదంటే అనుమానించాలి. అరుదుగా ఇలాంటి ఇబ్బంది తలెత్తిన పక్షంలో దీనిని ఒక సమస్యగా పరిగణించవలసిన అవసరం లేదని వైద్యులు పేర్కొంటున్నారు. మగవారిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో స్తంభన సమస్యను చవిచూడటం సర్వసాధారణమైన అంశం. 
 
మానసిక ఒత్తిడి, అధిక మోతాదులో మద్యాన్ని సేవించడం, ఇంకా చెప్పాలంటే శృంగార భావనలు సంప్రాప్తించకపోవడం కూడా సమస్యకు దారి తీస్తుంది. దీనికి, వయస్సుకు పెద్దగా సంబంధం లేకపోయినప్పటికీ 18 నుంచి 29 సంవత్సరాల వయస్సు గల వారిలో ఏడు శాతం మందికి ఈ సమస్య తలెత్తే అవకాశం ఉండగా, 50 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల వారిలో 18 శాతం మందికి ఈ సమస్య చోటు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. 
 
ఆరోగ్యకరమైన జీవన శైలిని ఆపాదించుకోవడం ద్వారా సమస్యకు దూరంగా ఉండవచ్చు. ధూమపానం, మద్యపానాలకు స్వస్తి చెప్పడం, ప్రతిరోజు వ్యాయామం, కొవ్వు శాతం తక్కువగా ఉండే ఆహారాన్ని స్వీకరించడం ద్వారా సమస్యను కొని తెచ్చుకుకోండా జాగ్రత్త పడవచ్చు. మధుమేహ వ్యాధి ఉన్నవారు వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవడం మంచిది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు