ఆ హీరోయిన్ ఫోటో చూస్తూ నాతో శృంగారం చేస్తున్నాడు... ఏం చేయాలి?

మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (17:11 IST)
మాది విజయవాడ. ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు మావారు. వివాహమై పదేళ్ళు అయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత రెండేళ్లుగా ఆయనలో మార్పు కనబడుతూ వస్తోంది. ప్రత్యేకించి ఓ హీరోయిన్ పట్ల బాగా ఆకర్షితులయ్యారు. ఎప్పుడూ ఆమె పేరే చెపుతూ విసిగిస్తున్నారు. చివరకు ఎంతవరకూ వచ్చారంటే... నాతో శృంగారం చేసే సమయంలో కూడా ఆమె ఫోటోలను, సినిమా వీడియోలను చూస్తూ చేస్తున్నాడు. ఈయనకేమైనా మతి భ్రమించిందా? ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేక తెలుపుతున్నాను.
 
కొందరు పురుషుల్లో ఇలాంటి విపరీత ధోరణులు వుంటుంటాయి. సహజంగా పెళ్లికాని యువకులు తాము పెళ్లాడబోయే అమ్మాయి ఫలానా హీరోయిన్ మాదిరిగా వుండాలని కలలు కంటారు. వారి ఫోటోలను పెట్టుకుని తిరుగుతారు. ఐతే పెళ్లయ్యాక ఇక తన భార్యే తనకు హీరోయిన్ కాబట్టి ఆ ఫోటోను వదిలేస్తారు. మీవారి విషయంలో ఆ పిచ్చి పోయినట్లు లేదు. ఆయన్ని దారిలోకి తెచ్చేందుకు మీరు కూడా కొన్నాళ్లపాటు అదే హీరోయిన్ నామజపం చేయండి. అతడికి ఏదో ఒకరోజు విసుగు వస్తుంది. దాంతో ఆ ఫోటోను పక్కన పడేస్తాడు. అప్పటికీ మానుకోనట్లయితే మానసిక వైద్యుడిని సంప్రదించాల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు