సంతానలేమికి కారణాలు ఏమిటి? ఏం చేస్తే సంతానప్రాప్తి... మగవారి కోసం...

శనివారం, 30 మార్చి 2019 (21:30 IST)
ప్రస్తుతకాలంలో చాలామంది దంపతులు సంతాన సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. ఇందుకు చాలావరకు మగవారే కారణం అని పలు సర్వేల్లో తేలుతున్న విషయం. కొందరు మగవారిలో సంతానోత్పత్తి శక్తి తక్కువగా ఉంటుంది. అలాగే వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉంటుంది. అయితే కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల వీర్యంలో నాణ్యత పెరుగుతుంది. 
 
సంతానోత్పత్తి శక్తి పెరుగుతుంది. స్తంభన సరిగ్గా లేకపోవడం, అలాగే స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండం అంటే వీర్య కణాలు తక్కువగా ఉండడం వంటి సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు. అలాగే టెస్టోస్టెరాన్ తక్కువగా ఉండండం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. సంతానోత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉండడం వల్ల సమస్యలకు గురవుతుంటారు. ఈ సమస్యల్ని అధిగమించేందుకు ఈ చిట్కాలు పాటిస్తే ప్రయోజనం వుంటుంది.
 
1. రోజూ వ్యాయామం చేస్తే మంచి శృంగార సామర్థ్యం వస్తుంది. దీని వల్ల టెస్టోస్టెరాన్ పెరుగుతుంది. వ్యాయామం చేసేవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది. అందువల్ల రోజూవ్యాయామాలు చేయాలి
 
2. విటమిన్ సి లభించే పదార్థాలను రెగ్యులర్‌గా తీసుకునేవారిలో కూడా ఆ సామర్థ్యం బాగా ఉంటుంది. దీనివల్ల శరీరానికి కావాల్సినంత ఆక్సిడెంట్స్ లభిస్తాయి. రెండు నెలల వరకు రోజుకు రెండుసార్లు విటమిన్ సి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల వీర్య కణాల సంఖ్య బాగా పెరుగుతుంది.
 
3. మెంతులతో తయారుచేసిన సప్లిమెంట్స్ కూడా రెగ్యులర్‌గా వాడాలి. రోజూ 500 మిల్లీగ్రాముల మెంతులతో తయారుచేసిన పదార్థాలు తీసుకున్నా కూడా ఆ సామర్థ్యం పెరుగుతుంది. టెస్టోస్టెరాన్ బాగా పెరుగుతుంది.
 
4. జింక్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. మాంసం, చేపలు, గుడ్లు, షెల్ల్ఫిష్ వంటి వాటిలో జింక్ ఎక్కువగా ఉంటుంది. తగినంత జింక్ తీసుకుంటే సంతానోత్పత్తి పెరుగుతుంది. స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. అలాగే టెస్టోస్టెరోన్ పెరుగుతుంది.
 
5. అశ్వగంధ కూడా పురుషుల్లో శృంగార సామర్థ్యం పెంచగలదు. అలాగే సంతానలేమితో బాధపడే మగవారు అశ్వగంధను తీసుకుంటే త్వరగా పిల్లలుపుడతారు.
 
6. ముఖ్యంగా రోజూ పనుల్లో బిజీగా ఉన్నా ఒత్తిడికి గురికాకుండా ఉండాలి. ఒత్తిడికి గురవడం వలన సామర్థ్యం తగ్గుతుంది. సంతానోత్పత్తి సరిగ్గా ఉండదు. ఒత్తిడి వల్ల కార్టిసాల్ స్థాయి పెరుగుతుంది. ఇది టెస్టోస్టెరాన్ పైన ప్రభావం చూపుతుంది. అయితే నడక వల్ల , ధ్యానం చేయడం వల్ల, వ్యాయామం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు