వర్షాకాలం, శీతాకాలంలో ఆస్తమా వ్యాధిగ్రస్థులు ఆరోగ్యంపై అధిక శ్రద్ధ తీసుకోవాలి. ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే...? పచ్చి ఉల్లిపాయలను ఆస్తమా వ్యాధిగ్రస్థులు ఎక్కువగా తీసుకోవాలి.
నియాసిన్, విటమిన్ బీ6 లోపంతో ఆస్తమా కలుగుతుంది. అందుచేత బీ విటమిన్ గల పచ్చని ఆకుకూరలు, పప్పుల్ని అధికంగా తీసుకోవాలి. ఇంకా ఒత్తిడి అధికం అవటం వలన కూడా ఆస్తమా కలుగవచ్చు. కానీ వంట తయారీకి వాడే నూనెలో విటమిన్-ఈ అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ వాడకాన్ని తగ్గించడం ద్వారా ఆస్తమాను తగ్గించుకోవచ్చు. సన్-ఫ్లవర్ విత్తనాలలో, బాదం, హోల్-గ్రైన్స్, చిరు ధాన్యాలలో విటమిన్-ఈ తక్కువగా ఉంటుందని గమనించండి.