ఈ 8 సింపుల్ టిప్స్ పాటిస్తే బరువు తగ్గవచ్చు...

గురువారం, 29 నవంబరు 2018 (20:47 IST)
అధిక శాతం అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. ఇది వచ్చిందంటే చాలు, దాంతో ఇతర అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికంగా ఉన్న బరువును తగ్గించుకునేందుకు అనేక రకాల పద్ధతులను సంబంధిత వ్యక్తులు పాటిస్తున్నారు. అయితే అవేకాకుండా కింద పేర్కొన్న పలు సింపుల్ టిప్స్‌ను పాటిస్తే బరువు తగ్గడం మరింత తేలికవుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. 
 
1. బరువు తగ్గాలనుకునేవారు వారానికి ఒక రోజు అన్ని పూటలూ భోజనానికి బదులుగా కూరగాయలు, ఆకుకూరలతో చేసిన సలాడ్ తీసుకుంటే ఫలితం ఉంటుంది. దీంతోపాటు శరీరానికి కావల్సిన పోషకాలు కూడా తగినంతగా లభిస్తాయి. 
 
2. తగిన చోటు, సమయం చూసుకుని కూర్చుని భోజనం చేయాలి. ఆహారాన్ని బాగా నమిలి మింగాలి. దీంతో అది త్వరగా జీర్ణమవుతుంది.
 
3. సాధ్యమైనంత చిన్న సైజ్ ప్లేట్‌లో భోజనం చేస్తే మీకు తెలియకుండానే పూటకు కనీసం 250 క్యాలరీలైనా తగ్గించి తింటారు.
 
4. నిద్రలేచిన గంటలోపే బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేయాలి. ఆలస్యంగా తింటే రెండు భోజనాల మధ్య సమయం తగ్గి కొవ్వు పెరుగుతుంది. 
 
5. రోజూ పాల ఉత్పత్తులు ఎంతో కొంత పరిమాణంలో తీసుకోవాలి. వీటిలోని కాల్షియం కొవ్వుని కొంత మేరకు తగ్గించగలదు. 
 
6. వ్యాయామం చేసిన తరువాత 30 నుంచి 60 నిమిషాల లోపు భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి. కొత్తగా చేరే క్యాలరీలను శరీరం అలసిపోయినప్పుడు వెంటనే ఉపయోగించుకుంటుంది.
 
7. భోజనానికి ముందు నారింజ లాంటి నిమ్మజాతి పండు సగం తింటే బరువు తగ్గుతారని పరిశోధనల్లో తేలింది. 
 
8. వారంలో 3 రోజులు గుడ్లు, ఒక పూట చేప తినడం కూడా బరువు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు