తాతల ముత్తాల కాలంలో ఉదయం పూట అల్పాహారంగా గంజినీళ్లు తాగేవారు. అంబలి తాగేవారు. కానీ కుక్కర్ల పుణ్యమా అని గంజి నీళ్ల ప్రయోజనాలు చాలామందికి తెలియట్లేదు. అన్నాన్ని కుక్కర్లో ఉడికించడం కంటే.. అన్నం వార్చి ఆ గంజిని తాగడం ద్వారా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గంజినీటిలో శరీరానికి కావాల్సిన ఎమినో యాసిడ్లు పుష్కలంగా ఉన్నాయి.