అయితే, నీళ్లు తాగమన్నారు కదా అని ఇతర ద్రవపదార్ధాలు తాగకూడదు. ముఖ్యంగా టీ, కాఫీ, సోడా, ఆల్కహాల్ వంటివి నీటికి ప్రత్యామ్నాయాలు కాదు. వీటన్నింటికీ కూడా శరీరంలో నీటిని బయటకు పంపించే లక్షణం ఉంది. దానివల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందే తప్ప మరో లాభంలేదు. అందుకే 'సే నో టు అదర్ డ్రింక్స్'. కేవలం నీటిని మాత్రమే తాగాలి.