కరివేపాకు, వేపాకు ముద్దను మజ్జిగలో కలిపి తీసుకుంటే?

శనివారం, 1 జులై 2017 (15:48 IST)
చర్మసమస్యలు వేధిస్తుంటే? లేత కరివేపాకు, వేపాకు ఆకులను ముద్దగా నూరి ఒక స్పూన్ ముద్దను అరకప్పు మజ్జిగలో పరగడుపున తీసుకుంటే చర్మ సమస్యలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. దురదతో ఇబ్బందులు పడేవారు కరివేపాకు, పసుపును సమానంగా తీసుకుని పొడిగొట్టి రోజూ ఒక స్పూన్ మోతాదులో నెలరోజులు తీసుకుంటే అలెర్జీలు మటుమాయం అవుతాయి.
 
ప్రతిరోజూ కరివేపాకు పొడిని ఒక స్పూన్ మోతాదులో తీసుకుంటే రక్తపోటును నియంత్రించవచ్చు. మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు ఒకస్పూన్ కరివేపాకు రసాన్ని రోజూ రెండుపూటలా తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. 
 
కరివేపాకు రసాన్ని పెరుగు లేదా వెన్నతో కలిపి పూతలా వేసుకుంటే కంటికిందటి వలయాలు మాయమవుతాయి. కరివేపాకును కొబ్బరినూనెలో మరిగించి.. వడగట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే వెంట్రుకలు ఒత్తుగా పెరగడంతో పాటు తెల్లబడవని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి