సైకిల్ తొక్కితే ఒత్తిడి తగ్గుతుందా? రక్తపోటు తగ్గుతుందా?
శుక్రవారం, 16 జూన్ 2017 (21:53 IST)
ప్రయాణ సాధనాలు అన్నింటిలోకి అద్భుతమైనది సైకిల్. ఖర్చు తక్కువ మరియు మంచి ఎక్స్‌ర్‌సైజ్‌గా ఉపయోగపడుతుంది. బ్లడ్ ప్రెజర్ వంటి అనేక శారీరక రుగ్మతలను కూడా తగ్గిస్తుంది. ప్రతీ రోజూ సైకిల్ తొక్కడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందులో కొన్ని....
1. బి.పిని తగ్గించడంలో జాగింగ్ కన్నాఇది మరింత మంచిది. జనరల్ ఫిట్‌నెస్ కలగజేస్తుంది.
2. రెసిస్టెన్స్ పెంచిన కొద్దీ ఎక్కువ కష్టపడి తొక్కాలి. అందువల్ల ఎక్కువ శక్తి ఖర్చువుతుంది. ఫలితంగా ఎక్కువ కాలరీలు ఖర్చయి శరీర బరువు తగ్గుతుంది.