దంతాల సంరక్షణతో పాటు వాటి ఆరోగ్యం చాలా ముఖ్యం. వీటిని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అయితే, ఇటీవలి కాలంలో దంతాలకు సంబంధించిన అవగాహన బాగా పెరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కువమంది డయాబెటిక్ రోగులు ఈ దంత సమస్యల బారినపడుతున్నారు. అందుకే దంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని దంత వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
* ప్రతిరోజూ రెండు సార్లు పళ్లు తోముకోవాలి. (రాత్రి నిద్రకు ముందు, పొద్దున్న నిద్ర లేవగానే)
* బ్రష్ చేసుకునేందుకు మృదువైన బ్రిజిల్స్ ఉన్న బ్రష్‌నే వాడాలి.
* మంచి టూత్‌పేస్ట్‌ను ఎంచుకోవాలి.
* పైన చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకూ నిలువుగా బ్రష్ చేసుకోవాలి.
* రఫ్‌గా బ్రష్ చేసుకుంటే చిగుళ్లకు హాని కలుగుతుంది. దీంతో చిగుళ్లు త్వరగా వ్యాధులకు గురవుతాయి.
* పంటికి బయటవైపే కాదు లోపలి వైపునా బ్రష్ చేసుకోవాలి. నమిలే ప్రదేశాల్లో పంటి పైన వెడల్పుగా ఉండే ప్రాంతంలోనూ బ్రష్ చేసుకోవాలి.
* కనీసం రెండు నిముషాలపాటు బ్రష్ చేసుకోవాలి.
* నాలుకపైన ఉన్న బ్యాక్టీరియాను తొలగించుకోవడానికి 30 సెకన్లపాటు స్క్రబ్ చేయాలి.
* చేత్తో చిగుళ్లను మసాజ్ చేసినట్లు రుద్దితే దంతాల ఆరోగ్యం మెరుగవుతుంది.
* ప్రతి మూడు నెలలకు ఓ సారి బ్రష్‌ను మార్చేయాలి.
* చిన్నపిల్లలు ఉన్నవారు ప్రతి 6 నెలలకోసారి వారిని డెంటిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాలి.
* మధుమేహ రోగులు తప్పనిసరిగా దంత వైద్యులను క్రమం తప్పకుండా సంప్రదించాలి.