* తేనే మరియు నెయ్యి కలిపి తినకూడదు. ఆ రెండింటి కలయిక విషపూరితమయినది.
* పెరుగు లేక మజ్జిగను అరటి పండుతో కలిపి తినకూడదు.
* కూరగాయలతో కలిపి వెన్న కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం.
* మొలలు ఉన్నవారు గుడ్లు, మాంసం తినకూడదు.
* నెయ్యిని రాగి పాత్రలో ఉంచి తినకూడదు.
* పొద్దునే మద్యం సేవించడం ఆరోగ్యానికి మంచిది కాదు. పొద్దునే మంచి నీరు తాగిన తరువాత త్రాగవచ్చు.
* అల్సర్ వ్యాధితో భాదపడుతున్నవారు కారాన్ని తినకూడదు.
* చర్మ వ్యాధులు ఉన్నవారు పొట్లకాయ, పల్లీలు, ఎండు చేపలు, చిక్కుడుకాయలు తినకూడదు.
* నువ్వుల నూనెతో గోధుమకి చెందిన వంటలను చెయ్యకూడదు.
* మోకాళ్ళ నొప్పులతో ఉన్నవారు మాంసం, గుడ్లుతో చేసిన వంటలు తినకూడదు.
* చేపల కూర తిన్న వెంటనే పాలు కానీ, పెరుగు కానీ తినకూడదు.
* లావుగా ఉన్నవారు బియ్యంతో వండినవి కాకుండా గోధుములతో వండిన ఆహార పదార్ధాలను తీసుకోవడం మంచిది..
* ఆస్తమా రోగులు టమోటా, గుమ్మడికాయ, ముల్లంగి తీసుకొనే ఆహారంలో వాడకూడదు. అలాగే వారు తల మీద ఎక్కువ తేమను కూడా ఉంచుకోవడం మంచిది కాదు.