మెంతుల వల్ల ఎన్నోరకాల ప్రయోజనాలు ఉన్నాయి. మెంతులు మధుమేహం (షుగర్) గల వారికి క్రమం తప్పక వాడినట్లయితే అద్భుతమైన గుణముగా అనిపిస్తుంది. 100 గ్రాముల మెంతులు రాత్రి మజ్జిగలో నానించి మెత్తగా రుబ్బి నేతితో చారెలు చేసి ఉంచుకోవాలి. ఇవి నెలరోజులు వరకు నిలువ ఉంటుంది. ఈ గారెలు షుగరు వ్యాధికి వాడుతూ కాకరకాయ ముక్క పచ్చిది ఒక తులం ఉదయమే టిఫిను తిన్న తర్వాత తింటే ఇంగ్లీషు వైద్యములోని ఇన్సులిన్ ఇంజక్షన్ గానీ, బిళ్లనుగానీ వాడకుండానే షుగరు కంట్రోల్ చేస్తుంది.
అంతేకాదు గడ్డలను కరిగించును, పక్వపరుచును. మేహశాంతిని కలుగజేసి విరేచనమును బంధించును. నరాలకు బలం ఇచ్చి స్త్రీలకు మాసక్రమ ప్రదరం (రుతురక్తమును) జారీ చేయును. దగ్గును, కషాయమును హరించును. కడుపు ఉబ్బరం, గ్యాసులను నిర్మూలించును. శరీరంలోని క్రొవ్వును తగ్గించి, సన్నబడేటట్లు చేస్తుంది మెంతులు.
మెంతులను పెరుగులోకి కలిపి (5గ్రాములు) నానించి మూడురోజులు రెండు పూటలా తీసుకుంటే రక్తవిరేచనములు తగ్గుముఖం పడతాయి. మెంతి పొడిని నీటితో ఉడికించి కడితే చీము గడ్డలు పగిలినొప్పి తగ్గుతుంది. అదే పిండిని ముల్లు గుచ్చుకున్న చోట కడితే నొప్పి తగ్గి ముల్లు బయటకు వస్తుంది. నానిన మెంతులను ఉల్లిపాయ ముక్కలతో కలిపి తింటే బంక విరేచనములు తగ్గుతాయి. రక్త విరేచనములు కలిగినప్పుడు నిమ్మకాయంత వెన్నలో ఉల్లిపాయ ముక్కలను కలిపి రెండు రోజులూ రెండు పూటలా తింటే అమోఘంగా పనిచేస్తాయి.