ఆరోగ్యానికి తాజా పండ్లు ఎంతో మంచివన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటివాటిలో ద్రాక్షని ఆహారంలో తీసుకోవడ వల్ల కలిగే లాభాలు ఎన్నో. అత్యంత పోషక విలువలు కలిగి ద్రాక్ష ఆరోగ్యాన్ని అంధించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలని నిర్మూలించడంలో ద్రాక్షపండు ప్రధాన పాత్ర పోషిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ద్రాక్షలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.
1. ద్రాక్షలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి కొన్ని రకాల క్యాన్సర్లను నివారించడంలో ద్రాక్షలో ఉండే ఫైటో ట్యూట్రియెంట్స్ బాగా పని చేస్తాయి. అలాగే గుండె ఆరోగ్యంగా ఉండడానికి ద్రాక్ష బాగా ఉపయోగపడుతుంది. పాలీఫెనోల్స్, రెవెవర్ట్రాల్ కూడా ద్రాక్షలో అధికంగా ఉంటాయి. రక్తపోటు తగ్గించే గుణాలు ద్రాక్షలో ఉంటాయి.
2. ద్రాక్షలంటే విటమిన్ సి గుర్తు వస్తుంది. కానీ సి-విటమిన్‌తో పాటుగా విటమిన్ ఎ, బి6, ఫోలిక్ ఆమ్లం కూడా వీటిలో పుష్కలంగా ఉన్నాయి. పొటాషియం, కాల్షియం, ఇనుము, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సెలీనియం లాంటి ఎన్నో రకాల ఖనిజలవణాలు ద్రాక్షల్లో సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాదు.. ఫ్లేవినాయిడ్స్ లాంటి శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్ బారి నుంచి రక్షిస్తాయి. వయసు వల్ల కలిగే ముడతలను తగ్గిస్తాయి.
4. చాలా మంది అసిడిటితో బాధపడుతుంటారు. ఈ సమస్య ఉన్నవారు, ఒక గ్లాసు తాజా ద్రాక్షరసంను ప్రతి రోజూ త్రాగడం వల్ల ఇది అసిడిటిని తగ్గిస్తుంది. తిన్న ఆహారం అరగకుండా అజీర్ణంతో చీకాకు కలిస్తుంటే ద్రాక్ష రాసాన్ని కానీ లేదా ద్రాక్షపండ్లను కానీ తీసుకోవడం వల్ల అజీర్తిని అరికట్టడానికి సహాపడుతుంది.