కర్పూరాన్ని కొబ్బరినూనెతో కలిపి కీళ్ల నొప్పులు ఉన్నచోట రాస్తే చాలా త్వరితంగా సాంత్వన లభిస్తుంది. ఇంకా అడవి గోరింట కషాయాన్ని కొద్దికాలం పాటు తీసుకుంటే తీవ్రమైన కీళ్లనొప్పులు కూడా తగ్గుతాయి. జీలకర్ర తైలంలో ఉప్పు కలిపి వంటికి రాసుకుంటే అన్ని రకాల వంటినొప్పులు తగ్గుతాయి. పత్తి గింజలను వేయించి పొట్టు తీసి తింటే పంటి నొప్పి, నరాల బలహీనత తగ్గుతాయి.
రాత్రిపూట ఒక కప్పు శనగలను నానబెట్టాలి. ఉదయాన్నే ఆ శనగలలో బెల్లం కలిపి తినడం వల్ల మగవారిలో శృంగార సామర్థ్యం పెరగడంతో బాటు వీర్యకణాల వృద్ధి కూడా పెరుగుతుంది. గుప్పెడు శనగలను ఉడకపెట్టి వాటిని స్వచ్చమైన నేతిలో వేయించి ప్రతిరోజు ఉదయాన్నే తీసుకోవాలి. తరువాత గోరువెచ్చని పాలు తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరం దృఢంగా అవడమే కాకుండా వీర్యకణాల సంఖ్య కూడా మెరుగుపడుతుంది.