అన్నం తినడానికి ముందర ఆకలి వేస్తే జంక్ ఫుడ్ తీసుకోకుండా వాటికి బదులుగా కొన్ని నట్స్ తీసుకుంటే బరువు తగ్గుతారు. బాదం పప్పులు, జీడి పప్పులు, పిస్తాలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిల్లో క్యాలరీలు కూడా తక్కువగానే ఉంటాయి. అయితే ఉప్పు కలిపిన నట్స్‌ను మాత్రం తినొద్దు. ఎందుకంటే సోడియం ఎక్కువ శాతం శరీరంలోకి వెళ్లడం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది.
అలాగే బెర్రీస్‌ను వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా బరువు తగ్గొచ్చు. యాంటాక్సిడెంట్లు, పీచుపదార్థాలు బెర్రీల్లో పుష్కలంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే పొట్ట తగ్గుతుంది. బెర్రీలంటే స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ ... ఇవన్నీ బ్లడ్ షుగర్‌ని తగ్గిస్తాయి.