తేనె తీసుకుంటే.. రక్తహీనత..?

మంగళవారం, 11 డిశెంబరు 2018 (14:40 IST)
తేనె చర్మరక్షణకు ఎంతో దోహదపడుతుంది. తేనెలోని ఉపయోగాలు రక్తంలోని షుగర్ లెవల్స్, అధిక బరువును తగ్గిస్తాయి. చక్కెరకు బదులుగా తేనె వాడితే మంచిదని చెప్తున్నారు. తేనె చర్మాన్ని తాజాగా, కాంతివంతగా మార్చేలా చేస్తుంది. తేనెను చర్మానికి రాసుకుంటే శరీరంపై గల దుమ్ము, ధూళీ వంటివి పోతాయి. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరంలో చెడు బ్యాక్టీరియాలను తొలగించి మంచి బ్యాక్టీరియాలు ఏర్పడేలా చేస్తాయి.
 
తేనె తీసుకోవడం వలన శరీరంలో వేడి తగ్గుతుంది. తేనె.. పొడిబారిన చర్మానికి మంచి ప్యాక్‌లా పనిచేస్తుంది. తేనెను పెదాలకు రాసుకుంటే.. పెదాలు మృదువుగా తయారవుతాయి. తేనెలో క్యాల్షియం, సోడియం, క్లోరోసిన్, ఐరన్ వంటి ఖనిజాలు రక్తప్రసరణ సాఫీలా జరిగేలా చేస్తాయి. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే.. తేనె తీలుకుంటే చాలు.. ఫలితం ఉంటుంది. ఎముకల సాంద్రతను పెంచుతుంది. 
 
ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. ఒబిసిటీ వ్యాధితో బాధపడేవారు.. రాత్రివేళ్లల్లో గ్లాస్ పాలలో తగినంత తేనె కలిపి తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఇటీవలే ఆ పరిశోధనలో తెలియజేశారు. హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. కనుక డైట్‌లో తప్పక తేనె చేర్చుకోండి.. బరువు తగ్గండి... 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు