నిమ్మకాయ ప్రయోజనాలు చాలా మందికి తెలియవు. నిమ్మరసం పుల్లగా ఉండటం వల్ల ఈ రసాన్ని తాగేందుకు ప్రతి ఒక్కరూ అయిష్టత ప్రదర్శిస్తుంటారు. వాస్తవంగా చెప్పాలంటే 'విటమిన్ సి' పుష్కలంగా లభ్యమయ్యే వాటిలో నిమ్మపండు ఒకటి. మిటమిన్లు పుష్కలం. ఆయుర్వేద ఔషధం. సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. సహజ సిద్ధమైన యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తోంది. కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. పాటు బ్యూటీ బెనిఫిట్స్ కూడా దాగివున్నాయి. అలాంటి నిమ్మపండు రసాన్ని పరగడుపున తాగితే ఎన్నో ఆరోగ్య ఫలితాలు పొందవచ్చు.
ముఖ్యంగా జీర్ణ సమస్యలను తగ్గించడంలో నిమ్మకు మించిన దివ్యౌషధం మరొకటి లేదు. శరీరంలోని లవణ శాతాన్ని పెంచి, వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుంది. గోరువెచ్చని నీటిలో కూడా సేవించవచ్చు. ఇందులో కొన్ని అల్లం ముక్కలు, కొంచెం నిమ్మ రసం, టీ స్పూన్ తేనె కలుపుకుని తాగడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.