తాటి బెల్లం, ధనియాలతో చేసిన కషాయం తీసుకుంటే..?

సోమవారం, 28 జనవరి 2019 (10:44 IST)
నేటి తరుణంలో చాలామంది మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు. అందుకు ఎన్నెన్నో మందులు, మాత్రలు వాడుతున్నారు. అయినను సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. కొందరైతే మనలో ఇలాంటి వ్యాధి ఉందని కాస్త కూడా ఆలోచించకుండా చక్కెర ఎక్కువగా తింటున్నారు. ఇలా చేయడం వలన వ్యాధి ఎక్కువవుతుందే.. తప్ప తగ్గుముఖం పడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి చక్కెర తీసుకోకుండా ఎలా ఉండాలని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ కింది చిట్కాలు పాటించండి చాలు...
 
1. తాటి బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తరచు దీనిని తీసుకోవడం వలన ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవని ఇటీవలే ఓ పరిశోధనలో వెల్లడించారు. మధుమేహ వ్యాధితో బాధపడేవారు.. చక్కెరకు బదులు బెల్లం తింటే.. వ్యాధి అదుపులో ఉంటుంది. 
 
2. తాటి బెల్లాన్ని గ్లాస్ పాలలో కలిపి తీసుకుంటే.. ఎంతో రుచిగా ఉంటుంది. ఇలా ప్రతిరోజూ రాత్రివేళ నిద్రకు ఉపక్రమించే ముందుగా చేస్తే డయాబెటిస్ నుండి పూర్తిగా ఉపశమనం లభిస్తుంది.
 
3. తాటిబెల్లంలో ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవి శరీరంలో రక్తప్రసరణకు చాలా ఉపయోగపడుతాయి. అజీర్తి సమస్యకు బెల్లాన్ని తింటే చాలు తక్షణమే ఉపశమనం పొందవచ్చును.
 
4. తాటిబెల్లం రోజూ తినడం వలన శ్వాసకోస వ్యాధులు, చిన్నప్రేగుల్లో చేరుకున్న విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. అలానే దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న వ్యాధులకు కూడా బెల్లం ఎంతగానో దోహదపడుతుంది.
 
5. చాలామంది పిల్లలు చూడడానికి చాలా నీరసంగా ఉంటారు. అలాంటివారికి తాటిబెల్లం తినిపించడం మంచిది. ఎందుకంటే.. తాటి బెల్లంలోని న్యూట్రియన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు.. వారి శరీరానికి కావలసిన ఎనర్జీని అందిచడమే కాకుండా.. శరీర రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. 
 
6. గర్భిణులకు అప్పుడప్పుడు కాళ్లు, చేతులు వాపుగా ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. తాటి బెల్లం, ధనియాలు, జీలకర్ర, యాలకుల పొడితో చేసిన కషాయం తీసుకుంటే.. శరీర వాపులు తగ్గుతాయి.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు