ఎన్నో అనారోగ్య సమస్యలను తరిమికొట్టగల శక్తి తేనెకు ఉంది. తేనె సూక్ష్మజీవుల సంహారిణి, బ్యాక్టీరియా, ఈస్ట్, మోల్డ్స్ వంటి వాటిని ఎదగనివ్వదు. ఇందులోని కార్బోహైడ్రేట్‌లు తక్షణ శక్తిని ఇస్తాయి. చిన్నచిన్న గాయాలు. చర్మ ఇబ్బందులకు తేనె విరుగుడుగా పనిచేస్తుంది. గొంతులో గరగరలను తగ్గిస్తుంది.
* తేనెలో కార్బోహైడ్రేట్‌లు, నీరు, మినరల్స్, విటమిన్స్ వుంటాయి. కాల్షియమ్, కాపర్, ఐరన్, మెగ్నీషియమ్, మాంగనీస్, పొటాసియమ్, ఫాస్ఫరస్, జింక్, విటమిన్ ఎ, బి, సి, డి తగినంత వున్నాయి. రైబో ఫ్లేవిన్, నియాసిన్‌లు తేనెలో లభిస్తాయి.
* కీళ్ళనొప్పులు బాదిస్తుంటే ఒక వంతు తేనె, రెండు వంతుల నీరు, ఒక చెంచా దాల్చినచెక్క పొడి తీసుకోండి. ఆ మిశ్రమాన్ని కలిపి ముద్ద చేసి బాధించే భాగం మీద మర్దనచేస్తే మర్దన చేసిన రెండు మూడు నిమిషాలలోనే ఉపశమనం కలుగుతుంది.