అలాంటివారు ఉలవలు తీసుకుంటే ఎంతో ప్రయోజనం (Video)

శుక్రవారం, 10 జులై 2020 (22:31 IST)
ఇపుడంతా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన సమయం. ఇళ్లలో కూర్చుని ఇప్పుడు చాలామంది స్థూలకాయంతో బాధపడుతున్నారు. అలాంటివారు ఉలవలు తీసుకుంటే ఎంతో ప్రయోజనం వుంటుంది. ఉలవలను ఆహార రూపంలో తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుంది. అందుకోసం ఒక కప్పు ఉలవలకు నాలుగుకప్పులు నీళ్లు కలిపి కుక్కర్‌లో ఉడికించాలి. ఇలా తయారుచేసుకున్న ఉలవకట్టును ప్రతిరోజూ ఉదయంపూట ఖాళీ కడుపుతో, చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు.
 
ఉలవలను, కొత్త బియ్యాన్నీ సమంగా తీసుకొని జావమాదిరిగా తయారుచేసుకుని దీనిని పాలతో కలిపి కొన్ని వారాలపాటు క్రమంతప్పకుండా తీసుకుంటే శృంగారానురక్తి పెరుగుతాయి. ఐతే దీనిని వాడేటప్పుడు మలబద్ధకం లేకుండా చూసుకోవాలి.
 
శరీరంలో అల్సర్లు తగ్గటానికి పావు కప్పు ఉలవలను, చిటికెడు పొంగించిన ఇంగువను, పావు టీస్పూన్ అల్లం ముద్దను, పాపు టీ స్పూన్ అతిమధురం వేరు చూర్ణాన్నీ తగినంత నీటిని కలిపి ఉడికించాలి. దీనికి తేనె కలిపి కనీసం నెలరోజులపాటు తీసుకుంటే బాహ్యంగా, అభ్యంతరంగా తయారైన వ్రణాలు లేదా అల్సర్లు త్వరితగతిన తగ్గుతాయి.
 
అంతేకాదు మూత్రాశయంలో తయారయ్యే రాళ్లను కరిగించి వెలుపలకు రావడానికి ఉలవలు సహకరిస్తాయి. తరచూ ఎక్కిళ్లు వస్తుంటే ఉలవలు తగ్గిస్తాయి.


 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు